కార్తీక్ రత్నం హీరోగా రవితేజ నిర్మించనున్న''ఛాంగురే బంగారురాజా''

క్రైమ్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కేరాఫ్ కంచరపాలెం, నారప్ప ఫేమ్ కార్తీక్ రత్నం ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కుషిత కల్లపు కథానాయికగా కనిపించనుంది. సత్య అక్కల, రవిబాబు ఇతర ముఖ్య తారాగణం. సెప్టెంబర్ నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ''ఛాంగురే బంగారురాజా' టైటిల్ శ్రీ కృష్ణ పాండవీయంలోని పాపులర్ పాట నుండి తీసుకున్నారు. టైటిల్ పోస్టర్‌లో కార్తీక్ రత్నం రెండు భిన్నమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం ఆకట్టుకుంది.