శర్వానంద్ కోసం పాట పాడిన కార్తీ

మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటివలే విడుదలైన ''ఒకటే కదా'' పాట సూపర్ హిట్ అయ్యింది. అన్నీ మ్యూజిక్ ఫ్లాట్ ఫార్మ్స్ పై ట్రెండింగ్ లో నిలిచింది. తాజాగా ఈ చిత్రం నుండి ''మారిపోయే'' అనే పాటని విడుదల చేశారు. ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే స్టార్ హీరో కార్తీ స్పెషల్ ఎప్పిరియన్స్ లో కనిపించి, స్వయంగా ఆయనే పాడి అందరినీ సర్ ప్రైజ్ చేశారు. 'నేనే పాడుతున్నా'' అంటూ తనదైన శైలిలో అభిమానులని, ప్రేక్షకులని మెస్మరైజ్ చేశారు కార్తీ.