ఈ సినిమాలో చిరంజీవి గారు చేసిన నటనతో థియేటర్లు మోత మొగయిపోతాయ్ : సత్యదేవ్

కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఆర్బి చౌదరి, ఎన్వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్గా నిర్మిస్తున్నారు. గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో సత్యదేవ్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.