‘ఓరి దేవుడా’ చిత్రం నుంచి బ్యూటీఫుల్ రెయిన్ సాంగ్ ‘గుండెల్లోన...’ రిలీజ్.. కట్టిపడేస్తోన్న అనిరుధ్ వాయిస్

యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి. బ్యానర్పై ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వ‌త్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్ హీరో వెంకటేష్ ఇందులో దేవుడు పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 21న విడుద‌ల చేస్తున్నారు.