AK62 నుంచి ఎందుకు తప్పుకున్నాడో కారణం చెప్పేసిన డైరెక్టర్ విఘ్నేష్‌ శివన్

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తారో తెలిసిన విషయమే. అయితే తునివు, వలిమై తర్వాత అజిత్‌ నుంచి వస్తున్న సినిమాను నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తారని ప్రకటన వచ్చింది. అయితే తర్వాత ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంటున్నట్టు విఘ్నేష్ ప్రకటించారు.