సెల్వరాఘవన్, ధనుష్ ల "నేనే వస్తున్నా" చిత్రం నుండి "వీరా సూర ధీర రారా" పాటను చూసారా?

“కాదల్ కొండేన్”, “పుదుపేట్టై”, “మయక్కం ఎన్న” తర్వాత ధనుష్ మరియు సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాల్గవ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వి క్రియేషన్స్ బ్యానర్ పై "కలైపులి ఎస్ థాను" నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లుఅర‌వింద్ విడుద‌ల చేస్తున్నారు.