విశ్వక్ సేన్ మరియు వెంకటేష్ దగ్గుబాటి నటించిన ‘ఓరి దేవుడా’ నుంచి ‘ఔననవా ఔననవా..’ విడుదల

యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. ఈ సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వ‌త్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తన్నారు. స్టార్ హీరో వెంకటేష్ ఇందులో దేవుడు పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.