'శాకిని డాకిని' యూనిక్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్.. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు:  'శాకిని డాకిని' చిత్ర యూనిట్

'శాకిని డాకిని' సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హీరో అడవి శేష్, దర్శకులు నందిని రెడ్డి, అనుదీప్, విమల్ కృష్ణ ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు. ఈ వేడుకలో సీనియర్‌ కథానాయకుడు రెబల్ స్టార్ కృష్ణంరాజుకు నివాళిగా చిత్ర బృందం మౌనం పాటించి అంజలి ఘటించింది.