కన్నడ స్టార్ దర్శన్ కొత్త సినిమా ప్రారంభం; హీరోయిన్ గా పరిచయం అవుతున్న మాలాశ్రీ కూతురు

సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ రవిశంకర్ గురూజీ స్వయంగా హాజరై సినిమా తొలి షాట్‌కి కెమెరా స్విచాన్ చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ తన రాక్‌లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తెలుగు,కన్నడ , మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'రాబర్ట్' ఫేమ్ తరుణ్ సుధీర రచన, దర్శకత్వం వహిస్తున్నారు.