కన్నడ హీరో యశ్.. కేజీయఫ్ సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఆయన తర్వాత నటించే సినిమాల గురించి చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి అప్‌ డేట్ రాలేదు. కన్నడ హీరో యశ్ కేజీయఫ్ సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. కేజీయఫ్ ముందు వరకు కన్నడ సినీ పరిశ్రమకు తప్ప బయటి వాళ్లకు తెలియని యశ్ ఈ సినిమాలతో దేశమంతా పాపులర్ హీరో అయిపోయాడు. కేజీఎఫ్ 2 సినిమా అయితే ఏకంగా 1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని అమాంతం పెంచేసింది. Also Read - అనుష్క ఫ్యాన్స్‌కు తప్పని ఎదురుచూపులు.. మరోసారి వాయిదా పడనున్న Miss శెట్టి Mr పోలిశెట్టి

ఇక కేజీయఫ్ సినిమాల తర్వాత యశ్ ఏ సినిమా చేస్తాడా అని అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే యశ్ నెక్స్ట్ సినిమాపై అనేక రూమర్స్ వచ్చాయి. మళ్లీ కేజీయఫ్ 3 తీస్తాడని, పలువురు స్టార్ డైరెక్టర్స్ తో సినిమా అని, బాలీవుడ్ కి వెళ్తాడని, బాలీవుడ్ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ అని.. ఇలా అనేక వార్తలు వచ్చాయి. ప్రస్తుతం యశ్ మలయాళం లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి.

తాజాగా యశ్ ఫ్యామిలీతో కలిసి ఓ ఆలయానికి వెళ్లారు. యశ్ ని చూడటానికి అక్కడికి భారీగా అభిమానులు, మీడియా వచ్చారు. ఈ నేపథ్యంలో మీడియా యశ్ ని తన నెక్స్ట్ సినిమా ఏంటి? బాలీవుడ్ కి వెళ్తున్నారని అంటున్నారు నిజమేనా అనే ప్రశ్నలు వేసింది. వీటికి యశ్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతోంది. బాలీవుడ్‌లో సినిమా చేయడం, బాలీవుడ్‌కు వెళ్లడం అనే అంశాలపై ఆయన చేసిన సంచలనంగా మారాయి. Also Read - పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన సీనియర్ నటుడు నాజర్.. వైరల్ అవుతున్న కామెంట్లు

‘నేను ఎక్కడికీ వెళ్ళను, నేను ఉన్న చోటికే అందరినీ వచ్చేలా చేస్తాను. త్వరలోనే తర్వాతి సినిమా గురించిన విషయాలు తెలియజేస్తాను’ అని తెలిపారు యశ్‌. దీంతో యశ్ చెప్పిన సమాధానం ప్రస్తుతం వైరల్ గా మారింది. యశ్ మాస్ రిప్లైకి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక అభిమానులైతే రాకింగ్ స్టార్ అంటే ఆ మాత్రం ఉంటుంది అని అంటున్నారు.

కాగా, కేజీయఫ్ సినిమాల తర్వాత యశ్‌కు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆయన ఎక్కడికి వెళ్లినా అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయనను చూడడానికి వస్తున్నారు. మీడియా కూడా ఆయన చేయనున్న సినిమాల గురించి ఎక్కువగా ప్రశ్నిస్తోంది. అంతేకాదు, కన్నడ సినీ పరిశ్రమతోపాటు అన్ని సినీ పరిశ్రమలు యశ్ సినిమా గురించిన ప్రకటన కోసం ఎదురుచూస్తున్నాయి. కేజీయఫ్‌ 3 సినిమా ప్రకటించే అవకాశాలపైన కూడా విస్తృతంగా చర్చ సాగుతోంది. Also Read - వరుణ్ తేజ్ కొత్త సినిమా మట్కా.. టైటిల్‌తోనే మాస్ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేసిన మెగా ప్రిన్స్