కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు 'ది ఘోస్ట్' ట్రైలర్ ని లాంచ్ చేసిన మహేష్ బాబు

నాగార్జున తన ఫెరోసియాస్ యాక్ట్ తో ఏజెంట్ విక్రమ్‌గా పవర్-ప్యాక్డ్ ఫెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. ట్రెండీ ఎటైర్ పాటు సూట్‌లు, యూనిఫామ్‌లో కూడా తనదైన ఫ్యాషన్ తో అలరించారు.నాగార్జున సబార్డినేట్‌గా కనిపించిన సోనాల్ చౌహాన్ గ్లామర్ విందు పంచారు. నాగార్జున సోదరిగా గుల్ పనాగ్ నటిస్తుండగా, మేనకోడలుగా అనిఖా సురేంద్రన్ కనిపించింది. ట్రైలర్‌లో ది ఘోస్ట్ తన ప్రధాన ఆయుధం తమహగనే వాడినట్లు చూపించారు.