'విక్కీ ది రాక్ స్టార్' నుంచి ‘పోదాం వెళ్లిపోదాం’ పాట విడుదల

‘పోదాం వెళ్లిపోదాం’ అంటూ సాగే ఈ పాటను విడుదల చేశారు. ఈ పాటలో హీరో హీరోయిన్లు, వారి స్నేహితులు కలిసి వేస్తున్న ట్రిప్స్, వాటి లొకేషన్లను అందంగా చూపించారు. ముఖ్యంగా ఈ పాటలోని లొకేషన్లు మాత్రం అందరినీ కట్టిపడేసేలా ఉన్నాయి. సునీల్ కశ్యప్ అందించిన బాణీ.. విశ్వనాథ్ కాసర్ల సాహిత్యం, విష్ణుప్రియ గాత్రం అద్భుతంగా కుదిరాయి.