ఓటీటీ లో స్ట్రీమింగ్ కి సిద్ధమైపోయిన సాయి పల్లవి గార్గి

కన్నతండ్రిని పోలీసుల చెర నుంచి విడిపించడానికి ఓ కుమార్తె చేసే ప్రయత్నమే 'గార్గి' చిత్రకథ. చేయని తప్పుకు తండ్రి జైలు శిక్ష అనుభవిస్తున్నాడని సాయి పల్లవి పాత్ర ఆవేదన చెందుతుంది. అయితే... సినిమా చివరకు వచ్చేసరికి అందరూ షాక్ అయ్యే ముగింపుతో, ఎవరూ ఊహించని క్లైమాక్స్‌తో దర్శకుడు ఆశ్చర్యపరిచారు.