సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న సమంత. కారణం ఇదే అంటున్న ఫ్యాన్స్

జులై 21న ఇన్‌స్టాగ్రామ్‌లో చివరిగా పోస్ట్ చేసిన సమంత.. ఆ తర్వాత సోషల్ మీడియాకు దూరమైంది. ట్విట్టర్‌లో కూడా ఎలాంటి పోస్ట్ చేయలేదు. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్‌ లో బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా భారీగా సంపాదించే సెలబ్రిటీస్ లో సమంత ముందంజులోనే ఉన్నారు. అలాంటిది ఈ హీరోయిన్ ప్రస్తుతం సోషల్ మీడియాకి దూరంగా ఉండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి మూడు వారాలైంది.