Sign In

శింబు-గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు' ఈ నెల 15న విడుదల

రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి.కె. గణేష్ భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది. ఈ నెల 15న విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత 'స్రవంతి' రవి కిషోర్ మాట్లాడుతూ ‘’ ట్రైలర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. చాలా పాజిటివ్ గా ఉందనిపించింది. శింబు యాక్టింగ్ గురించి, గౌతమ్ మీనన్ టేకింగ్ గురించి, రెహమాన్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శింబూ కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.