నాగార్జున పుట్టిన రోజు సందర్బంగా కొత్త పోస్టర్ ను విడుదల చేసిన 'ది ఘోస్ట్' నిర్మాతలు

కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో తమహగనే చేతిలో పట్టుకుని కుర్చీలో కూర్చుని హైలీ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు నాగార్జున. సరికొత్త కాన్సెప్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం నుండి విడుదల చేసిన ఈ పోస్టర్ పర్ఫెక్ట్ బర్త్ డే ట్రీట్ గా నిలిచింది. ఈ చిత్రంలో తమహగనే అనేది నాగార్జున ఆయుధం. తమహగనే గ్లింప్స్ కి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. నాగార్జున, సోనాల్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్లుగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో గుల్ పనాగ్ , అనిఖా సురేంద్రన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.