సెన్సేషనల్ డైరెక్టర్ వి వి వినాయక్ చేతుల మీదుగా ‘పగ పగ పగ’ ట్రైలర్ విడుదల

ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన సినిమా పోస్టర్‌, మూవీ మోషన్ పోస్టర్‌, కోటి నటించిన పాత్రకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌‌కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం సెప్టెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో అందరికీ ఫ్రీగా చూపించబోతోన్న ఇటీవలే నిర్మాత ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలోని ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.